
ఆర్థిక పరిపుష్టి
వరి, పెసర రకాలు
డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో
వరి, పెసర రకాలు అందజేత
సుస్థిర వ్యవసాయాభివృద్ధికి
కృషి విజ్ఞాన కేంద్రం తోడ్పాటు
అధిక దిగుబడి..
కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో..
రైతులు మోసపోకుండా ఉండేందుకు, అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుండగా, జిల్లాలో కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో విత్తనాలు అందజేశారు. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టాల బారిన పడకుండా రక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి ఒకరిద్దరు చొప్పున ప్రగతిశీల రైతులను ఎంపిక చేసి విత్తనాలు అందించారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయ వంగడాలు..
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాణ్యమైన, అధిక దిగుబడులు ఇచ్చే, చీడపీడల బారిన పడని వ్యాధి నిరోధక శక్తి కలిగిన విత్తనాలను అభివృద్ధి చేసి అందిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపై దృష్టి సారించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో నాణ్యమైన విత్తనం– రైతన్నకు నేస్తం, విత్తనం కొద్దీ పంట అనే నినాదంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విత్తనాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విత్తన కిట్లు వానాకాలం సీజన్‌లో ఎంపిక చేసిన రైతులకు పంపిణీ చేశారు. వరిలో డబ్ల్యూజీఎల్–44, డబ్ల్యూజీఎల్–1537 రకాల విత్తనాలు, పెసర పంటలో ఎంజీజీ–295 విత్తన కిట్లను అందించారు. ఈవిత్తనాలు అధిక దిగు బడి ఇస్తాయని, నేల సారానికి అనుకూలత, రైతుల ఆదాయాన్ని పెంచే లక్షణాలు కలిగి ఉంటాయని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. నాణ్య మైన విత్తనాల కార్యక్రమం సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుందని, రైతుల ఆదా యవృద్ధి, పంటల ఉత్పాదకత పెంపు, ఆహార భద్రతకు దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నా రు. కేవీకే ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు 836 విత్తన కిట్లను పంపిణీ చేశారు. వీటిలో వరి డబ్ల్యూజీఎల్–44 విత్తనాలు 220కిట్లు, డబ్ల్యూజీఎల్–1537 విత్తనాలు 127 కిట్లు పంపిణీ చేశారు. వరిలో పిలకలు ఎక్కువగా ఉండటం, చీడపీడలు సోకడం లేదని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. దీంతో మిగతా రైతుల నుంచి ఈ రకాలకు డిమాండ్ పెరుగుతోంది. పెసర ఎంజీజీ–295 విత్తనాలు –489 కిట్లను అందించగా, దిగుబడి పెరిగిందని రైతులు పేర్కొంటున్నారు. తక్కువ వ్యవధిలో పంట, అధిక ఉత్పాదకత కారణంగా ఇతర రైతులు ఆసక్తి చూపుతున్నారు.
వ్యవసాయ సీజన్ ప్రారంభంలో మార్కెట్‌లో వివిధ రకాల విత్తనాలు విక్రయిస్తారు. విస్తృతంగా ప్రచారం చేస్తూ అధిక దిగుబడులు వస్తాయంటూ దళారులు నమ్మిస్తారు. దీంతో పలువురు రైతులు నమ్మి ఆ విత్తనాలు కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తున్నారు. కొన్ని నాసిరకం, నకిలీ విత్తనాలు కావడంతో పంట ఏపుగా ఎదగక, ఎదిగినా దిగుబడులు రాక నష్టపోతున్నారు. పెట్టుబడి కూడా పూడక అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే రైతులకు మేలైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
–సూపర్‌బజార్(కొత్తగూడెం)
డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తాం. రైతుల ఆర్థిక పరిపుష్టి, ఆహార భద్రత సాధనలో ఇవి కీలకం. సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కేవీకే సహకరిస్తుంది. –డాక్టర్ టి.భరత్,
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం
రైతులకు నాణ్యమైన
విత్తనాల పంపిణీకి శ్రీకారం

ఆర్థిక పరిపుష్టి

ఆర్థిక పరిపుష్టి