
అలరించిన సంగీత లహరి
భద్రాచలంటౌన్: పట్టణంలోని గుప్త ఫంక్షన్ హాల్‌లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని నటరాజ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంగీత లహరి కార్యక్రమం అలరించింది. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేతెల్లం వెంకట్రా వు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ భీమపాక నగేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యం ఎన్నో వేల పాటలు పాడి తెలు వాడి ఖ్యాతిని చాటారని పేర్కొన్నారు. సంగీత లహరి వంటి కార్యక్రమాలతో కళాకారుల ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్, సింగర్ రాజు, పాకల దుర్గాప్రసాద్, బుడగం శ్రీనివాస్, వరలక్ష్మి, సత్యలింగం, రాఘవయ్య, విజయరావు, ఉదయ్‌కుమార్, శ్రీలత, శ్రీహరి, నరేష్, వెంకటేష్, గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హరిహర క్షేత్రాన్ని సందర్శించిన న్యాయమూర్తి
పట్టణంలోని హరిహర అయ్యప్ప క్షేత్రాన్ని తెలంగా ణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ నంబూద్రి అరున్ రామచంద్రన్ స్వా గతం పలకగా న్యాయమూర్తి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆవరణలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
హాజరైన హైకోర్టు న్యాయమూర్తి, ఎమ్మెల్యే