
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ముదిగొండ: ముదిగొండ మండలంలో సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని యడవల్లి, మాదాపురం, ముదిగొండలో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, పలు పార్టీల నాయకులు భట్టి సమక్షాన కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాగా, వెంకటాపురంలో ఆదివారం ఏర్పాటుచేసిన సన్నాహాక సమావేశంలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడారు. భట్టి పర్యటనను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీలు మందరపు నాగేశ్వరరావు, పసుపులేటి దేవేంద్రం, మహిళా విభాగం జిల్లా, మండల అధ్యక్షురాలు సౌజన్య, ఝాన్సీరాణి, నాయకులు కందిమళ్ల వీరబాబు, ఇసుకల రమేష్, మట్టా బాబురాంరెడ్డి పాల్గొన్నారు.