
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
ఇల్లెందురూరల్: మండలంలోని హనుమంతులపాడు గ్రామంలో జక్కుల సతీశ్ (40) ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున తన గదిలో దూలానికి ఉరివేసుకున్న సతీశ్‌ను ఉదయం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అతడికి ఇద్దరు కుమార్తెలు ఉండటంతో పెద్దకుమార్తె సంజన తలకొరివి పెట్టింది. మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య పెద్ద అల్లుడైన సతీశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సతీశ్‌కు భార్య ఝాన్సీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి మృతి
దమ్మపేట: కొబ్బరి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన చొప్పారపు రాజేశ్ (29) భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం శివారులోని కొబ్బరితోటలో కాయలు కోయడానికి ఈ నెల 14న వచ్చాడు. ఆయన చెట్టుపైకి ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లిలో చికిత్స అనంతరం విజయవాడ తరతలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై రాజేశ్ తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు దమ్మపేట ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.