
డ్రోన్ టెక్నాలజీతో ప్రయోజనాలు
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ, ఇతర పనుల్లో సాంకేతిక పరికరాల వాడకం పెరుగుతోందని, డ్రోన్ టెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ అన్నారు. శనివారం కళాశాల విద్యార్థులకు డ్రోన్లు, డ్రోన్ పైలెట్‌గా ఉద్యోగ, వ్యా పార అవకాశాలపై అవగాహన కల్పించారు. కళాశాలలోని పొలాల్లో సాగు చేస్తున్న వరి, పత్తి పంటలకు పురుగుల మందులు, ఎరువులను డ్రోన్ సాయంతో పిచికారీ చేయించి నేరుగా విద్యార్థులకు చూపించారు. ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ పురుగు మందుల పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించడం వల్ల మనుషులకు ముప్పు ఉండదన్నారు. అధ్యాపకులు రాంప్రసాద్, నాగాంజలి, నీలిమ, జెమిమా, డి.స్రవంతి, రవికుమార్ పాల్గొన్నారు.
కళాశాల అసోసియేట్ డీన్
డాక్టర్ హేమంత్ కుమార్