
ఎస్‌ఐఆర్ డెస్క్‌వర్క్ పూర్తి చేస్తాం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) డెస్క్ వర్క్ పూర్తి చేస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎలక్షన్ సూపరింటెండెంట్ రంగాప్రసాద్, ఏఈఆర్‌ఓలు దారా ప్రసాద్, పుల్లయ్య, ఎన్నికల నిర్వహణ సిబ్బంది పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ జితేష్