
ఇసుక లారీ బోల్తా
చర్ల: మండలంలోని జీపీపల్లిలో ఇసుక రీచ్ నుంచి లోడుతో వస్తున్న ఇసుక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. శుక్రవారం మొగళ్లపల్లి ఇసుక రీచ్‌లో లోడ్ చేసుకుని వస్తుండగా జీపీపల్లి శివారులో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం తాగి నడపడం వల్లే లారీ బోల్తా పడిందని స్థానికులు పేర్కొంటున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సింగరేణి(కొత్తగూడెం): ిసంగరేణి కొత్తగూడెం కార్పొరేట్‌లో ఆఫీస్ అటెండెంట్ టీఎస్ గ్రేడ్–హెచ్‌లో 26 ఖాళీలను భర్తీకి యాజమాన్యం శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. తెలుగులో చదవటం, రాయటం తెలిసినవారు అర్హులని, సంస్థవ్యాప్తంగా పనిచేసే జనరల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.