2జీ సిమ్‌లతో తిప్పలు | - | Sakshi
Sakshi News home page

2జీ సిమ్‌లతో తిప్పలు

Sep 20 2025 6:10 AM | Updated on Sep 20 2025 6:10 AM

2జీ సిమ్‌లతో తిప్పలు

2జీ సిమ్‌లతో తిప్పలు

యాప్‌ల వివరాలు..

ఆవేదన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లు 5జీ ఫోన్లు, సిమ్‌లు అందించాలని విన్నపాలు

కొత్తగూడెంటౌన్‌: అంగన్‌వాడీ కేంద్రాలు, లబ్ధిదారుల వివరాలను మొబైల్‌ యాప్‌ల్లో నమోదు చేసేందుకు టీచర్లు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. సరైన ఇంటర్నెట్‌ వేగం లేకపోవడంతో హాజరు నమోదు, వివరాలు అప్‌లోడ్‌ చేసేందుకు గంటకు పైగా సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 5జీ స్పీడ్‌ డేటా వినియోగంలో ఉండగా 2020లో ప్రభుత్వం 2,060 మంది అంగన్‌వాడీ టీచర్లకు 2జీ ఫోన్లును అందించింది. ఆ సెల్‌లో 5జీ సిమ్‌ వేసినా ఇంటర్నెట్‌ వేగం లేక తిప్పలు తప్పడం లేదు. రోజూ కేంద్రాల కార్యకలాపాలతోపాటు లబ్ధిదారుల హాజరు, సరుకుల వినియోగం వివరాల నమోదుకు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు.

గంటల తరబడి నిరీక్షణ..

ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో 10–20 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార ం అందుతోంది. ఈమేరకు యాప్‌ల్లో హాజరు వివరాలు, లబ్ధిదారులకు ఇస్తున్న పోషకాహారం పొందుపర్చాలి. జిల్లాలో మెయిన్‌ అంగన్‌వాడీ సెంటర్లు 2,060 ఉండగా,36,600 మంది చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలు నమోదై ఉన్నారు. అయితే, టీచర్లకు ఇచ్చిన సెల్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ వేగంగా లేక హాజరు నమోదు, లబ్ధిదారులకు ఇచ్చే పౌష్టికాహారం వివరాల నమోదుకు ఇబ్బంది ఎదురవుతోంది. వీటికి తోడు నెల, మూడు నెలలకోసారి ఆరోగ్య పరమైన ఎదుగుదల, ప్రీ ప్రైమరీ పాఠశాలల పిల్లల పురోగతిని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. మూడు యాప్‌లో వివరాల నమోదుకు ఇంటర్నెట్‌ వేగం లేని కారణంగా గంటల తరబడి ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.

న్యూట్రీషియన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం (ఎన్‌హెచ్‌టీఎస్‌) : ఈ యాప్‌లో ఒక్కో కుటుంబం నుంచి ఎందరు సెంటర్‌కు వస్తున్నారు, అందులో పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఎంత మందో నమోదు చేయాలి. అలాగే, పౌష్టికాహారం పంపిణీ తదితర వివరాలను ఎనిమిది విభాగాల్లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌ : రోజూ టీచర్లు, ఆయాలు, పిల్లలు, తల్లులు, గర్భిణుల హాజరును ఈ యాప్‌ ద్వారా నమోదు చేయాలి. ఉదయం 9గంటలకు ఒకసారి, సాయంత్రం 4గంటలకు రెండేసి సార్లు హాజరు నమోదుతో పాటు స్నాక్స్‌ ఏమేం ఇచ్చారో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌ సెంటర్‌ ఆవరణలో ఉంటేనే పనిచేస్తుంది.

ఎర్లీ చైల్డ్‌కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీసీజీ) : ప్రీ స్కూల్‌కు సంబంధించిన ఈ యాప్‌లో డిజిటల్‌ లైబ్రరీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌, బోధన, హెల్ప్‌లైన్‌, సపోర్ట్‌ వివరాలు నమోదవుతాయి. మూడు నెలలకోసారి చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదల, ఆరోగ్యం వంటి వివరాలే కాక 0–5 ఏళ్ల చిన్నారులకు బోధన, పోషకాహారం, హాజరు సమాచారం కూడా పొందుపర్చాలి.

మొబైల్స్‌ యాప్‌లలో వివరాల నమోదులో ఆలస్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement