
టీజీఎస్ ఆర్టీసీలో పదోన్నతులు
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లోని వివిధ డిపోల ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. శ్రామిక్‌లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఏడీసీలకు పదోన్నతులు కల్పించి నూతన స్థానాలకు బదిలీ చేస్తూ ఆర్‌ఎం సరిరామ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం ఆర్‌ఎంగా సరిరామ్ బాధ్యతలు చేపట్టాక ఉద్యోగులకు పదోన్నతులు లభించడం ఇది రెండోసారి కాగా, కోరుకున్న స్థానాలకు బదిలీ చేయడంపై వారు వ్యక్తం చేశారు. కండక్టర్లు, డ్రైవర్లకు అసిస్టెంట్ డిపో క్లర్క్‌లుగానే కాక ఏడీసీలు, టీఐ–3 ఉద్యోగులు పలువురికి పదోన్నతి లభించింది.
పద్నోతులు ఇలా...
శ్రామిక్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న 14 మందికి హెల్పర్లుగా పదోన్నతి కల్పించారు. సత్తుపల్లి, ఖమ్మం డిపోల నుంచి నలుగురు చొప్పున, భద్రాచలంలో ఇద్దరితో పాటు ఖమ్మం, మధిర, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అలాగే, రీజియన్‌లో 14 మంది మెకానిక్స్, ఆర్టిజన్లకు గ్రేడ్–1 మెకానిక్‌లుగా పదోన్నతి లభించింది. ఇక కండక్టర్, డ్రైవర్లు 14 మందికి ఏడీసీలుగా పదోన్నతి కల్పించారు. ఇందులో ఖమ్మం డిపో నుంచి ఏడుగురు, భద్రాచలంలో ముగ్గురు, కొత్తగూడెంలో ఇద్దరు, సత్తుపల్లి, మణుగూరు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అలాగే, ఐదుగురు ఏడీసీలకు డిపో క్లర్క్(డీసీ)లుగా పదోన్నతి లభించింది. మధిరలో ఇద్దరు, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం డిపోల్లో ఒక్కొక్కరు ఉన్నారు.
జాబితాలో శ్రామిక్‌లు,
కండక్టర్లు, డ్రైవర్లు, ఏడీసీలు