
ఉత్సాహంగా జోనల్ క్రీడలు
పాల్వంచరూరల్/జూలూరుపాడు: పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన క్రీడామైదానంలో శుక్రవారం పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు మండలాల జోనల్ క్రీడాపోటీలను నిర్వహించారు. మూడు మండలాల నుంచి 500 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించారు. వివిధ విభాగాల నుంచి జిల్లాస్థాయి పోటీలకు 356 మందిని ఎంపిక చేశారు. జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చండ్రుగొండ జోనల్‌స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో విభాగాల్లో అండర్–14, అండర్–17 బాలబాలికలకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో స్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, ఆయా మండలాల ఎంఈఓలు, పీఈటీలు పాల్గొన్నారు.

ఉత్సాహంగా జోనల్ క్రీడలు