
విద్యా బోధన మెరుగుపడాలి
బూర్గంపాడు/అశ్వాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన మరింత మెరుగుపరచాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, డీఈఓ నాగలక్ష్మి సూచించారు. అంజనాపురం, పినపాక పట్టీనగర్‌లలోని ప్రాథమిక పాఠశాలలను వారు వేర్వేరుగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో నూతనంగా అమలు చేస్తున్న ఏఐ డిజిటల్ క్లాస్‌లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు సులభతర రీతిలో బోధన జరగాలన్నారు. విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. వసతులను పరిశీలించారు. మల్లెలమడుగు–1 అంగన్‌వాడీ కేంద్రంలో టాయిలెట్‌లో నీటి సౌకర్యం లేకపోవడం, అంగన్‌వాడీ కేంద్రంలో తాగునీటి సౌకర్యం లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంఈఓ ఎదుసింహరాజు పాల్గొన్నారు.