
ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలోని జిమ్నాజియం హాల్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి మహిళల ఖేలో ఇండియా వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం సతీమణి నందిని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
తొలుత జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం పలు కేటగిరిల్లో విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షు డు వి.శ్రుతి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్య దర్శి కె.క్రిష్టోఫర్‌బాబుతోపాటు శివగణేశ్, దొంగల వినోద్‌కుమార్, హనుమంతరాజు, రవి, సుధాకర్, సీహెచ్ నాగరాజు, సిద్ధార్థనాగిరెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, పోటీలకు రాష్ట్రంలోని నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్‌స్కూల్, ఖమ్మం,వరంగల్ తదితర జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
జూనియర్ బాలికల 44 కేజీల విభాగంలో సింధు, బి.గౌతమి, 48 కేజీల కేటగిరిలో శ్రీపాద శ్రీజ, ఎం.సహస్ర, బి.అలేఖ్య, 53 కేజీల కేటగిరిలో ఎ.ట్రోనీ, పి.అర్చన, వై.అంజలి, 58 కేజీల విభాగంలో ఎం. స్వాతి, జి.శ్రుతి, ఎ.వర్షిత, 63 కేజీల కేటగిరిలో టి.ఆర్చన, కె.స్వాతి, ఎం.గౌరీ, 69 కేజీల కేటగిరిలో వి.హరిత, బి.హరిణి, 77 కేజీల విభాగంలో బి.తో షిని, బింధుప్రియ, కీర్తన, 77 కేజీల పైకేటగిరిలో వి.సహస్ర, లిబికా, మహేశ్వరీ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.