
అర్హత కోల్పోయాం.. న్యాయం చేయండి..
పాల్వంచ: తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివినప్పటికీ నీట్ 2025–26 కౌన్సెలింగ్‌లో అర్హత కోల్పోయామని, తమకు న్యాయం చేయాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. తెలంగాణలో పుట్టి పెరిగిన తాము పక్కనే ఆంధ్రాలో ఇంటర్ చదివామని, ఇటీవల ప్రభుత్వం జీఓ 33 తెచ్చి ఇంటర్ వేరే రాష్ట్రంలో చదివిన వారికి ఇక్కడ సీట్లు కేటాయించబోమని ప్రకటించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఎండీ పెరహన, హైమావతి, శివలక్ష్మి, ఎలమర్తి రవిబాబు, శ్రీనివాసరావు, రోహిణి, వషిత, అక్షయ్, మానస, నిమిషా, నోమిత తదితరులు పాల్గొన్నారు.