
ప్రైవేటు పాఠశాల ఎదుట మృతదేహంతో ధర్నా
భద్రాచలంటౌన్: యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపిస్తూ శనివారం కుటుంబ సభ్యులు, కుల, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సరిహద్దు ఏపీలోని ఎటపాక గ్రామానికి చెందిన నాగమోహనాచారి–సరిత దంపతుల కుమారుడు లోకేష్ శనివారం పాఠశాలకు వచ్చి ఆడుకుంటూ కింద పడిపోయాడు. దీంతో పాఠశాల సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. సీఐ నాగరాజు పాఠశాలకు వద్దకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
యాజమాన్య నిర్లక్ష్యం వల్లే రెండో తరగతి విద్యార్థి మృతి చెందాడని ఆరోపణ

ప్రైవేటు పాఠశాల ఎదుట మృతదేహంతో ధర్నా