
సొంతింటి పథకానికే కార్మికుల మొగ్గు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 11,12 తేదీల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. శనివారం యూనియన్ బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. కొత్తగూడెం ఏరియాలోని వివిధ డిపార్ట్‌మెంట్లలో ఓటింగ్ నిర్వహించగా 2,575 మంది ఓటేశారని తెలిపారు. వారిలో 2,651 మంది సొంతింటి కోసమే ఓటువేశారని, 11 ఓట్లు క్వార్టర్లు కావాలని వేశారని, 3 ఓట్లు చెల్లలేదని వివరించారు. కొన్ని కార్మిక సంఘాలు యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి బ్యాలెట్ ఓటింగ్‌కు ఆటంకం కల్పించేందుకు కుట్రలు పన్నారని, యాజమాన్యంతో కూడా ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. కార్మికుల అభిప్రాయం ప్రకారం యాజమాన్యం స్పందించి సొంతింటి పథకం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.రాజారావు, వై.వెంకటేశ్వర్లు, భూక్య రమేష్, లిక్కి బాలరాజు, గడల నరసింహారావు, లక్ష్మణరావు, ఎల్లగొండ రామ్మూర్తి, కార్తీక్, సామర్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ నిర్వహించిన
బ్యాలెట్ ఓటింగ్‌లో వెల్లడి