
ఎంఆర్‌ఐ అందుబాటులో లేక..
ప్రైవేటులోనూ ఒకే మిషన్
అత్యవసర పరిస్థితుల్లో
బాధితుల అవస్థలు
కొత్తగూడెంలోని ప్రైవేట్
ల్యాబ్‌లో ఒకే ఒక్క మిషన్
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు
చేయాలని విన్నపాలు
పాల్వంచ: రాష్ట్రంలోనే అతిపెద్ద, గిరిజన ప్రాంతమైన జిల్లాలో ఎంఆర్‌ఐ(మ్యాగ్నటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్), ఎంఆర్‌ఏ(మ్యాగ్నటిక్ రెజొనెన్స్ యాంజియోగ్రఫీ) స్కానింగ్‌లు అందుబాటులో లేవు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించే పరిస్థితి ఉండటంలేదు. ఎంఆర్‌ఐ కోసం ఖమ్మం వెళ్లాల్సివస్తోంది. దీనివల్ల భారీ ఖర్చు కూడా పెరుగుతోంది. ఒక్కో స్కానింగ్‌కు కనీసం రూ.5వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతోంది. దీంతో బాధితులపై భారం పడుతోంది.
ఎంఆర్‌ఐ, ఎంఆర్‌ఏ స్కానింగ్ మిషన్లు లేక జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీని ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల ప్రైవేటులో కూడా ఒకే మిషన్ అందుబాటులో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఖమ్మం వెళుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంఆర్‌ఐ స్కానింగ్ అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చేస్తాం.
–డాక్టర్ రవిబాబు, డీసీహెచ్‌ఎస్
జిల్లా సుమారు 7,483 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, 2011 జానాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 1,069,261 ఉంది. ప్రస్తుతం ఇంకా పెరిగింది. ఆంధ్రా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరి హద్దులుగా ఉండటంతో ప్రధాన రహదారులపై వాహన రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రమాదాల శాతం కూడా అధికంగానే ఉంటోంది. తీవ్రంగా గాయపడినా, శరీరంలో అనారోగ్య సమస్య వచ్చినా ఎంఆర్‌ఐ, ఎంఆర్‌ఏ స్కానింగ్ రిపోర్ట్‌ల ఆధారంగానే వైద్యులు చికిత్స అందిస్తుంటారు. జిల్లావ్యాప్తంగా కేవలం కొత్తగూడెంలోనే ప్రైవేట్ లాబ్‌లో ఒకే ఒక్క మిషన్ అందుబాటులో ఉంది. జిల్లాలోని వైద్యులంతా స్కానింగ్ కోసం బాధితులను అక్కడికే పంపిస్తున్నారు. మిషన్ ఖరీ దు సుమారు రూ.6కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొందరు వైద్యులు కమీషన్ల కోసం ఎంఆర్‌ఐ, ఎంఆర్‌ఏ స్కానింగ్‌లు రాస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకే మిషన్ ఉండటంతో నిర్వాహకులు కూడా అధిక మొత్తం ఫీజులు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. భారీఖర్చుతో కూడినది కావడంతో ఆర్థిక స్తోమత లేనివారు ఎంఆర్‌ఐ తీసుకోవడం ఇబ్బందిగా మారింది. జిల్లా ప్రధానాస్పత్రిలో ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, బూర్గంపాడులలో సీహెచ్‌సీలు ఉండగా, కనీసం జిల్లా ప్రధానాస్పత్రిలోనైనా ఎంఆర్‌ఐ, ఎంఆర్‌ఏ స్కా నింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురా వాలని ప్రజలు కోరుతున్నారు.

ఎంఆర్‌ఐ అందుబాటులో లేక..