
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు
ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛను హరించేలా తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పుపడుతున్నారు. ‘సాక్షి’ తెలుగు దినపత్రికకు చెందిన పలు ఎడిషన్ కేంద్రాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇక ప్రభుత్వం హామీల అమలులో చేస్తున్న జాప్యంపై ప్రజల పక్షాన వార్తల ప్రచురిస్తే మాత్రం కేసులు నమోదు చేసి సాక్షి కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. తాజాగా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన
భావ ప్రకటనా స్వేచ్ఛను అక్కడి ప్రభుత్వం తమ గుప్పిట్లోకి తీసుకునేలా చేస్తున్న ప్రయత్నాలపై పలువురు మండిపడ్డారు.
– ఖమ్మం సహకారనగర్ / ఖమ్మం లీగల్