
●పాఠశాలలో ‘తెర’గతి గది
మండలంలోని మారుమూల కొత్త కావడిగుండ్ల గ్రామంలో ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయినులు విధులు నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు 30 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల భనవంలో ఒకే తరగతి గది ఉండగా, అందులో ఐదు తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో
ఉపాధ్యాయులు వరండాకు గ్రీన్ షీట్‌ను ఏర్పాటు చేసి మరో తరగతి గదిని ఏర్పాటు
చేసుకుని పాఠాలు బోధిస్తున్నారు. – అశ్వారావుపేటరూరల్