
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
అశ్వాపురం: ఎన్‌సీసీ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్‌సీసీ శిబిరంలో శుక్రవారం కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. క్రమశిక్షణ అలవర్చుకోవాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ సంజయ్‌కుమార్ భద్ర, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్‌యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, తహసీల్దార్ మణిధర్, విద్యార్థులు పాల్గొన్నారు.
నానో యూరియాతో ఇన్సూరెన్స్ సౌకర్యం
టేకులపల్లి: నానో యూరియాతో రైతులకు రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబూరావు తెలిపారు. శుక్రవారం టేకులపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా నానో యూరియా, నానో డీఏపీ పిచికారీపై డెమో ద్వారా రైతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫ్కో యూరియా నాలుగు బాటిళ్లు కొన్నవారు బిల్లు భద్రపరచుకోవాలని చెప్పారు. రైతు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఇన్సూరెన్స్ లభిస్తుందని తెలిపారు. డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సరిత, ఏఓ అన్నపూర్ణ, శ్రావణి, విశాల పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్