
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాక ప్రజలను చైతన్యవంతులను చేసేలా పత్రికలు వ్యవహరిస్తాయి. అలాంటి పత్రికల స్వేచ్ఛను హరించడం సరికాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలన్నా... ప్రజలకు ఏమేం వసతులు కావాలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంలో పత్రికలు కీలకంగా నిలుస్తాయి. కానీ ఏపీలో ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్జి, జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు.
– ఎస్.విజయ్,
టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి