
గొంతు నొక్కేయడం కక్షే..
పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కేయడం సరికాదు. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం, అక్కడ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ప్రజల పక్షాన నిలిచే వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
– సింగం జనార్ధన్,
టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్, ఖమ్మం