
అనర్హులకు పోస్టింగ్ ఇచ్చారు..
టేకులపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ స్కూళ్లలో టీచర్, ఆయా పోస్టుల నియామకాల్లో అనర్హులకు పోస్టింగ్‌లు ఇచ్చారని బాధితులు ఆరోపించారు. నోటిఫికేషన్ రద్దు చేసి అర్హులను నియమించాలని కోరారు. శుక్రవారం మండలంలోని తావుర్యాతండా పంచాయతీ స్టేషన్ తడికలపూడి ప్రాథమిక పాఠశాల వద్ద పలువురు బాధితులు సుమారు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. స్టేషన్‌తడికలపూడి ప్రీ ప్రైమరీ స్కూల్‌లో టీచర్, ఆయా ఇద్దరు శుక్రవారం విధుల్లో చేరేందుకు రావడంతో వివాదం మొదలైంది. ఈ పంచాయతీకి చెందిన తమకు అన్ని అర్హతలున్నా నిబంధనలకు విరుద్ధంగా ఇతర పంచాయతీల నుంచి టీచర్, ఆయాలను నియమించారని బాధిత అభ్యర్థులు బాదావత్ మంగ, బానోతు మంజుల, బొర్ర స్వరూపారాణి, బాణోతు జ్యోతి, గుగులోత్ దివ్య భారతి ఆరోపించారు. ఈ విషయమై ఎంఈఓ జగన్‌ను వివరణ కోరగా.. టీచర్, ఆయా నియామకాలు జరగలేదని, దరఖాస్తులను అమ్మ ఆదర్శ కమిటీలకు పంపించామని తెలిపారు. వారు ఎంపిక చేసి వివరాలు పంపిస్తే, కలెక్టర్‌కు నివేదిస్తామని పేర్కొన్నారు. కాగా పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలో 21 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించనున్నారు. వీటిల్లో స్టేషన్ తడికలపూడి ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. పాఠశాలల్లో టీచర్, ఆయా పోస్టుల భర్తీకి గత నెల 26న నోటిఫికేషన్ విడుదల చేశారు.
స్టేషన్ తడికలపూడి పాఠశాలలో
బాధితుల ఆందోళన