
కేటీపీఎస్ సొసైటీ అధ్యక్ష పీఠం ఎవరికో?
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ అధ్యక్ష పీఠం కోసం మంతనాలు జోరందుకున్నాయి. పాలక మండలి పదవుల కోసం ఎవరికివారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్థానిక డీఏవీ పాఠశాలలో సొసైటీ డైరెక్టర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం అర్ధరాత్రి ముగిసింది. ఎన్నికల్లో బీసీ కేటగిరీలో తోట అనిల్ కుమార్, కోన నాగేశ్వరరావు, ఎస్సీ ఉమెన్ విభాగంలో దాసరి వీరమణి, ఓసీ ఉమెన్ విభాగంలో రావు స్పందన, ఎస్టీ విభాగంలో నూనావత్ కేశులాల్, ఎస్సీ జనరల్ విభాగంలో వల్లమల ప్రకాశరావు, జనరల్ విభాగంలో దానం నరసింహారావు, డోలీ శ్రీనివాసరావు, వీరమల్లు రఘుకృష్ణ, సిద్ది ప్రశాంత్, బుద్దార్ధి మహేందర్, ధర్మరాజుల నాగేశ్వరరావు, సిద్దెల హుస్సేన్‌లు డైరెక్టర్లులుగా గెలుపొందారు. విజేతలు రంగులు పులుముకుని సంబరాలు జరుపుకున్నారు.
అధ్యక్ష పదవి కోసం పోటీ
పాలక మండలి అధ్యక్ష పీఠం కోసం గతంలో పనిచేసిన దానం నర్సింహారావు, ధర్మరాజుల నాగేశ్వరరావులు పోటీ పడుతున్నారు. చెరో రెండేళ్ల చొప్పున అధ్యక్ష పదవిలో ఉండేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. సెక్రటరీ పోస్టు కోసం డోలి శ్రీనివాసరావు, కోన నాగేశ్వరరావు, కోశాధికారిగా మహేందర్, కేశులాల్‌లు పోటీ పడుతున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా తోట అనిల్‌కుమార్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం కొత్తపాలక వర్గం కొలువు దీరేలా కార్మిక సంఘాల నాయకులు చొరవ తీసుకుంటున్నారు.
పాలక మండలి పదవుల కోసం
పావులు కదుపుతున్న డైరెక్టర్లు