
జర్నలిస్టుల హక్కులపై ఉక్కుపాదం
చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. కక్షగట్టి సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజం, జర్నలిస్టుల హక్కుల రక్షణకు పాలకులు పాటుపడాలి. అంతేతప్ప ప్రభుత్వం – ప్రజలకు వారధిగా ఉంటూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలను ఫాసిస్టు చర్యగా భావిస్తున్నాం.
– ఆకుతోట ఆదినారాయణ, టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్), ఖమ్మం జిల్లా అధ్యక్షుడు