
మునగ, వెదురు సాగు లాభదాయకం
డీఆర్‌డీఓ విద్యాచందన
ములకలపల్లి: మునగ, వెదురు పంటల సాగు ఎంతో లాభదాయకమని డీఆర్‌డీఓ విద్యాచందన అన్నారు. మండల పరిధిలోని మూకమామిడి పంచాయతీలో సాగు చేస్తున్న మునగ తోటలను పరిశీలించారు. మహిళా రైతులతో మాట్లాడి, సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐకేపీ కార్యాలయంలో వెదురు సాగు చేస్తున్న మహిళా సమాఖ్య గ్రూపు సభ్యులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. డీపీఎం సమ్మక్క, ఇంచార్జ్ ఎంపీడీఓ రామారావు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వైకల్యం అధిగమించి
ఉన్నతస్థాయికి ఎదగాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి రాజేందర్
కొత్తగూడెంటౌన్: వైకల్యం అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఎం. రాజేందర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం బాబుక్యాంప్‌లోని భవిత సెంటర్‌లో గురువారం ప్రపంచ బధిరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మూగ, చెవిటి పిల్లలకు కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముగ్గురు బధిర పిల్లలకు వినికిడి పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అంగవైకల్యం అడ్డురాదని, అలాంటి వారిని అందరూ ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వాలు దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, డిస్ట్రిక్ వేల్పేర్ ఆఫీసర్ స్వర్ణలత లెనినా, ఎంఈఓ బాలాజీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రి సిబ్బంది పఫీన్ తదితరులు పాల్గొన్నారు.
రైతు వేదికల్లోనూ యూరియా విక్రయాలు
డీఏఓ బాబూరావు
ఇల్లెందురూరల్: యూరియా సరఫరాలో సమస్యతో రైతులు పీఏసీఎస్ విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరకుండా ఇక నుంచి రైతు వేదికల్లోనూ యూరియా అందుబాటులో ఉంచుతామ ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు తెలిపారు. మండలంలోని సుదిమళ్ల, రేపల్లెవాడ రైతు వేదికల్లో యూరియా విక్రయాలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇల్లెందులో ఇప్పటికే మూడు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏడీఏ లాల్‌చంద్, ఏవో సతీష్, రైతులు పాల్గొన్నారు.
నేటి నుంచి సింగరేణి వ్యాప్తంగా క్రీడలు
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి వ్యాప్తంగా గురువారం నుంచి క్రీడా పోటీలు ప్రారంభంకానున్నాయి. 2025–26 సంవత్సరానికి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూపీఎస్–జీఏ) ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లో క్రీడలు నిర్వహించనున్నారు. కార్పొరేట్ ఏరియాలో 12న ఫుట్‌బాల్ పోటీలతో క్రీడలు ప్రారంభమై, సెప్టెంబర్ 28న సాంస్కృతిక కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఇందుకోసం ప్రకాశం స్టేడియం, సీఈఆర్, కేసీఓఏ క్లబ్ సిద్ధమవుతున్నాయి. ఇతర ఏరియాల్లో కూడా క్రీడా మైదానాలు, క్లబ్ భవనాలు వేదికలుగా నిలుస్తున్నాయి. క్రీడా పోటీల సమన్వయానికి అధ్యక్షుడిగా జి.వి.కిరణ్ కుమార్ (జిఎం, పర్సనల్ వెల్ఫేర్–సీఎస్‌ఆర్ )తోపాటు మరికొందరు బాధ్యులను నియమించారు. ఏరియా స్థాయి విజేతలను ప్రాంతీయస్థాయి, ఆపై సంస్థ స్థాయి పోటీలకు పంపనున్నారు.
ఎస్పీని కలిసిన డీఎస్పీ
కొత్తగూడెంటౌన్: ఎస్పీ బి.రోహిత్‌రాజును జిల్లా సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేటర్ సెంటర్ డీఎస్పీ బి.అశోక్ మర్యాదపూర్వకంగా కలిశా రు. సీఐగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై గురువారం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీని కలిసి పూల మొక్కను అందజేశారు.

మునగ, వెదురు సాగు లాభదాయకం

మునగ, వెదురు సాగు లాభదాయకం

మునగ, వెదురు సాగు లాభదాయకం