
మట్టి ట్రాక్టర్ల అడ్డగింత
పట్టుకుని అధికారులకు అప్పగించిన గ్రామస్తులు జేసీబీ, మూడు ట్రాక్టర్లను తప్పించిన
అశ్వారావుపేటరూరల్: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గురువారం గ్రామస్తులు పట్టుకున్నారు. మండలంలోని జమ్మిగూడెం శివారు చెరువు శిఖం భూముల్లో నుంచి మూడు రోజులుగా జేసీబీతో మట్టి తవ్వి ఏడు ట్రాక్టర్లతో తరలించి విక్రయిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన కొందరు గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకుని పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ సిబ్బంది, ఆర్‌ఐ పద్మావతి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమతులు లేవని గుర్తించి ట్రాక్టర్లను తహసీల్‌కు తరలించారు. కాగా, తవ్వకాలు చేసిన జేసీబీతోపాటు మరో మూడు ట్రాక్టర్లను మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న వ్యక్తులు తప్పించడం గమనార్హం. ట్రాక్టర్లను అడ్డుకున్న వారిలో స్థానికులు మిద్దిన కొండయ్య, మిద్దిన రాములు, సింగలూరి కృష్ణ, దానపు సింగయ్య, లక్కదాసు శ్రీను, రెడ్డి లక్ష్మి, దానపు జయమ్మ ఉన్నారు.
అక్రమార్కులు!