
సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం
కరకగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లవుతున్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావడంలేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కరకగూడెంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరోగమనంలోకి వెళ్తోందని విమర్శించారు. మండలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన వట్టివాగు ప్రాజెక్ట్‌ను రద్దు చేశారని ఆరోపించారు. కొత్త టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి మూన్నాళ్ల ముచ్చటగా వదిలేశారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన పోరాడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు ఊకే రామనాథం, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, బుడగం రాము, రంజిత్ కుమార్, చిరంజీవి, రాంబాబు, కృష్ణ, ప్రసాద్, వేణు, ప్రభాకర్, సుధాకర్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు