
వేధిస్తున్న సిబ్బంది కొరత
ఖాళీ పోస్టుల వివరాలు
● పశువైద్య శాఖలో 69 పోస్టులు ఖాళీ ● మూగజీవాలకు సక్రమంగా అందని వైద్యం ● ఏడాది కాలంగా భర్తీ చేయని ఉన్నతాధికారులు
పాల్వంచరూరల్: పశుసంవర్థక శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పశువులకు సక్రమంగా వైద్యసేవలు అందడంలేదు. జిల్లాలో 2018–2019 లెక్కల ప్రకారం పశుసంపద 4.55 లక్షలు ఉన్నాయి. ఇందులో తెల్లపశువులు 2.80 లక్షలు, నల్లపశువులు (గేదెలు) 1.70లక్షలు, మేకలు 2.50 లక్షలు, గొర్రెలు 2.60 లక్షలు, నాటుకోళ్లు 1.38 లక్షలు, పందులు 3,180, కుక్కలు 30వేలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 80 పశువైద్యశాలలు ఉండగా, వీటిలో ఆరు ప్రాంతీయ పశువైద్యశాలలు, 30 ప్రాథమిక పశువైద్యశాలలు, 44 పశువైద్యశాలల ఉపకేంద్రాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా అధికారులు, సిబ్బంది కలిపి 219 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 150 మంది మాత్రమే ఉన్నారు. మరో 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాల్వంచ పట్టణంలోని ఏరియా పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఇన్‌చార్జితో నెట్టుకొస్తున్నారు.
పశువైద్యంపై ప్రభావం
వెటర్నరీ శాఖలో ఖాళీ పోస్టులు ఏడాది నుంచి భర్తీ చేయడంలేదు. సిబ్బంది కొరతతో జిల్లాలోని పశు సంపదపై ప్రభావం పడుతోంది. పశువులు, గేదెలు అనారోగ్యం బారిన పడి సకాలంలో వైద్యసేవలు అందక మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పశుసంవర్థక శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.
హోదా మొత్తం ప్రస్తుతం ఖాళీలు
పోస్టులు ఉన్నది
డిప్యూటీ డైరెక్టర్ 1 1 0
అసిస్టెంట్ డైరెక్టర్లు 8 6 2
వెటర్నరీ అసిస్టెంట్లు 30 28 2
ఆఫీస్ సూపరింటెండెంట్లు 2 2 0
సీనియర్ అసిస్టెంట్లు 6 4 2
జూనియర్ అసిస్టెంట్లు 10 10 0
టైపిస్ట్ 1 1 0
లైవ్‌స్టాక్ ఆఫీసర్లు 10 5 5
జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు 18 14 4
లైవ్ స్టాక్ అసిస్టెంట్లు 24 24 0
వెటర్నరీ అసిస్టెట్లు 23 11 12
ఎన్యూమరేటర్ 1 1 0
వెటర్నరీ వ్యాక్సినేటర్లు 14 3 11
డ్రైవర్లు 2 1 1
ఆఫీసు అటెండర్లు 69 39 30
219 150 69