
కొనసాగుతున్న టిమ్ డ్రైవర్ల నిరసన
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్లు చేపట్టిన నిరసన మూడో రోజు బుధవారం కూడా కొనసాగింది. 42 మంది టిమ్ డ్రైవర్లు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో అధికారులు 10 సర్వీసులను తగ్గించారు. ఫలితంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు యూనియన్ల నాయకులు జేఏసీగా ఏర్పడి, టిమ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డీఎం తిరుపతిని కోరారు. లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని చెప్పారు. భద్రాచలానికి డిపోనకు చెందిన టిమ్ డ్రైవర్ నాగరాజు పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తోటి డ్రైవర్లు తెలిపారు. కాగా భద్రాచలం డిపోలో సేప్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఎస్‌డీఐ)గా విధులు నిర్వహిస్తున్న పోకల సురేష్ తన పోస్టుకు మంగళవారం రాత్రి రాజీనామా చేశారు.