
కోలాహలంగా ‘కేటీపీఎస్’ ఎన్నికలు
పాల్వంచ/మణుగూరురూరల్: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికలు బుధవారం కోలాహంగా జరిగాయి. కేటీపీఎస్ కాలనీలోని డీఏవీ పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో 2,100 మంది సభ్యులకు 1,728 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మణుగూరులోని బీటీపీఎస్ ఎస్‌పీఎఫ్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన పోలింగ్ కేంద్రంలో 500 మంది ఉద్యోగస్తులకు గాను 450మంది ఓటు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వైటీపీఎస్‌లో 396 మంది ఓటర్లకుగాను 367 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్ల ను ఆకర్షించేలా ఫ్లకార్డులు, కరపత్రాలు, గుర్తులను సూచిస్తూ అభ్యర్థులు సందడి చేశారు. పోటీలో ఉన్న 37 మంది డైరెక్టర్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రా ల వద్ద ఉద్యోగులను కలుస్తూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. సొసైటీలో మొత్తం 2,996 మంది ఓటర్లు ఉండగా, 2,545మంది ఓటు హక్కు విని యోగించుకున్నారు. మొత్తం84.94శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్, ఎస్‌పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
84.94 శాతం పోలింగ్

కోలాహలంగా ‘కేటీపీఎస్’ ఎన్నికలు