
కాళోజీ సేవలు చిరస్మరణీయం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాకవి కాళోజీ నారా యణరావు సేవలు చిరస్మరణీయమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణసాహిత్యం, సంస్కృతి, భాషలకు కాళోజీ చిరస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టారని కొనియాడారు. ఆయన కవి మాత్రమే కాదని, సామాజిక ఉద్యమకారుడిగా, ప్రజా చైతన్యవేత్తగా తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారని వివరించారు. భావితరాలకు ఆయన రచనలు ధైర్యాన్ని, సామాజిక అవగాహనను కలిగిస్తాయని చెప్పారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మవిభూషణ్ తో సత్కరించిందని వివరించారు. కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, కలెక్టరేట్ ఏఓ అనంతరామకృష్ణ, ఓఎస్‌డీ వెంకటరమణ, జిల్లా ఉపాధి కల్ప నాధికారి శ్రీరామ్, బీసీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి పాల్గొన్నారు.
కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం
భద్రాచలం : కాళోజీ నారాయణరావు రచనలు నవ సమాజ నిర్మాణానికి, నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కాళోజీ రచనలు సాగాయన్నారు. ఆయనను స్ఫూర్తిగాతీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఏఓ సున్నం రాంబాబు, అధికారులు సైదులు, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు.
జయంతి వేడుకల్లో అదనపు
కలెక్టర్ విద్యాచందన