
నేడు కేటీపీఎస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ(పాల్వంచ) ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ మేరకు కేటీపీఎస్‌తో పాటు బీటీపీఎస్, వైటీపీఎస్‌ల్లో ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి జి.గంగాధర్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 13 డైరెక్టర్ పోస్టులకు గాను 37 మంది బరిలో నిలవగా 3,003 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పాల్వంచ కేటీపీఎస్ కాలనీలోని డీఏవీ పాఠశాలలో ఏడు, మణుగూరు బీటీపీఎస్‌లో ఎస్‌పీఎఫ్ భవనంలో రెండు, నల్లగొండ జిల్లా దామరచర్ల వైటీపీఎస్‌లోని స్పోర్ట్స్ ఆఫీస్‌లో రెండు బూత్‌లు ఏర్పాటుచేశారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్స్‌లను పాల్వంచకు తీసుకొచ్చి ఓట్లు లెక్కించాక ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, సాధారణ ఎన్నికల మాదిరిగానే డైరెక్టర్ పోస్టులకు బరిలో నిలిచిన వారు ఉద్యోగులకు నగదు పంపిణీ చేయడమే కాక విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.