
భారీగా గంజాయి పట్టివేత
జూలూరుపాడు: వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మీ పట్టుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రవితో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు. మాచినేనిపేటతండా శివారులో ఎస్‌ఐ రవి, పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్తగూడెం వైపు నుంచి వస్తున్న బొలేరోను ఆపి తనిఖీ చేయగా 63.580 కిలోల గంజాయి దొరికింది. దీని విలువ రూ.31.79 లక్షలు ఉంటుందని, దీనిని ఒడిశా నుంచి పుణేకు అశ్వాపురం మండలం రామచంద్రాపునికి చెందిన డ్రైవర్ కె.తేజ్‌కుమార్, హైదరాబాద్‌కు చెందిన ఎల్లా భాస్కర్‌రావు పట్టుబడ్డారని సీఐ తెలిపారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన జి.నాగరాజు, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి, ఒడిశాకు చెందిన అజాజ్ అలియాస్ అజయ్ పరారయ్యారన్నారు. బొలెరోను సీజ్ చేశామని, నిందితులను రిమాండ్‌కు తరలించామని సీఐ శ్రీలక్ష్మీ వివరించారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుళ్లు వెంకట్, కోటేశ్వరరావు, రామకృష్ణ, సురేశ్, సూర్యం, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.