
ఎదురెదురుగా లారీలు ఢీ
అశ్వారావుపేటరూరల్: ఎదురెదురుగా లారీలు ఢీ కొన్న ఘటలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి టవర్లకు సంబంధించి ఇనుప సామగ్రితో వస్తున్న లారీ, ఏపీ వైపు నుంచి ఖమ్మం వెళ్తున్న మరో లారీ అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం కాలనీ శివారులో ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీడ్రైవర్లు రాజ్‌కుమార్, తిరుమలరెడ్డి క్యాబిన్లలో ఇరుక్కుపోవడంతో ఘటన స్థలానికి వెళ్లిన సీఐ నాగరాజు, ఎస్‌ఐ అఖిల గ్రామస్తుల సహకారంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, లారీలో ఉన్న ఇనుప సామగ్రి రోడ్డుపై పడిపోవడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ఇనుప సామగ్రిని తొలగించడంతో వాహనాల రాకపోకలు సాగాయి.
ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు