
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం
మణుగూరురూరల్: మండలంలోని విప్పలసింగారానికి చెందిన కర్నె దిలీప్‌కుమార్ ఇంట్లోని గృహోపకరణాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమయ్యాయి. దిలీప్ కుమారుడు ఇంట్లో టీవీ చూస్తుండగా కరెంట్ పోవడంతో పక్కనే ఉన్న నాన్నమ్మ ఇంటికి ఆడుకునేందుకు వెళ్లాడు. కరెంట్ వచ్చాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, ఏసీ, కూలర్, దుస్తులు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు కరెంట్ కట్ చేయడంతో ప్రమాదం తప్పినట్లయింది. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, వేర్పుల సురేశ్, అక్కి నర్సింహారావు, జావిద్‌పాషా, పద్దం శ్రీను, రంజిత్, హర్ష, ఎం.శ్రీను,నాగయ్య, టి.శ్రీను, మణెమ్మ ఘటనా ప్రాంతానికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.