
క్యూలో చెప్పులు..
మణుగూరుటౌన్: మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట మంగళవారం తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టారు. మణుగూరు మండలానికి 60 – 70 టన్నులు యూరియా రావాల్సి ఉండగా, రెండు మూడు రోజులుగా 10 టన్నుల చొప్పున దిగుమతి అవుతోంది. అయితే మండలానికి సోమవారం 10 టన్నుల యూరియా దిగుమతి కాగా, విషయం తెలుసుకున్న రైతులు మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి చెప్పులు క్యూలో పెట్టి నిరీక్షించారు. సిబ్బంది ఉన్న యూరియాను రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 30 – 40 టన్నుల యూరియా మండల రైతులకు అవసరం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.