
దర్బార్ సమస్యలకు సత్వర పరిష్కారం
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం : గిరిజన దర్బార్‌లో వివిధ ప్రాంతాల వారు విన్నవించిన సమస్యల సత్వర పరిష్కారానికి ఆయా విభాగాల అధికారులు చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వారి సమస్యలను ఆలకించారు. అనంతరం మాట్లాడుతూ.. వినతుల సమర్పణ, సమస్యల పరిష్కారానికి ఐటీడీఏకు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అర్హులైన వారికి వెంటనే ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని గిరిజనులకు సూచించారు. దర్బార్‌లో వచ్చిన అర్జీలను పరిష్కరిస్తామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఏడీఎంహెచ్‌ఓ సైదులు, ఏఓ సున్నం రాంబాబు, ఎస్‌ఓ ఉదయభాస్కర్, ఆర్‌ఓఎఫ్‌ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఏపీఓ వేణు, ఉద్యానవనాధికారి ఉదయ్‌కుమార్, జేడీఎం హరికృష్ణ, నేజర్ ఆదినారాయణ పాల్గొన్నారు.