
కేవీకేకు రెండు పురస్కారాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఇటీవల తమిళనాడులో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రానికి రెండు పురస్కారాలు లభించాయి. తేనెటీగల పెంపకంలో యువ రైతులను ప్రోత్సహించడం, ఉత్తమ వార్షిక కార్యక్రమాలకు గాను ఈ అవార్డులు అందుకున్నామని కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ తెలిపారు. ఈ పురస్కారాలు తమ బాధ్యతను మరింతగా పెంచాయన్నారు. సహకరించిన శాస్త్రవేత్తలు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.
వసతి గృహానికి శంకుస్థాపన..
కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం వసతిగృహ నిర్మాణానికి తెలంగాణ మండల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ హెచ్‌ఓడీ డాక్టర్ ఆర్.ఉమారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివిధ శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్, శాస్త్రవేత్తలు నీలం హేమశరత్‌చంద్ర, బి.శివ పాల్గొన్నారు.