
రేషన్ డీలర్ల ఎదురుచూపులు
ప్రతి నెలా జిల్లాలో పంపిణీ చేసే రేషన్ బియ్యం వివరాలు (క్వింటాళ్లలో)
డీలర్లకు చెల్లించే కమీషన్ (రూ.లలో)
పెండింగ్ కమీషన్ చెల్లించాలి
● కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు నెలలుగా అందని కమీషన్ ● అమలుకు నోచుకోని గౌరవ వేతనం, కమీషన్ పెంపు
ఇల్లెందురూరల్: రేషన్ డీలర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదునెలలుగా కమీషన్ అందడంలేదు. దీంతో డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలో 442 రేషన్‌షాపులు ఉన్నాయి. ప్రతినెలా 3,17,273 రేషన్‌కార్డులకు డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారు. క్వింటా బియ్యం పంపిణీకి డీలర్లకు రూ.140 చొప్పున కమీషన్ చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేపట్టింది. జూన్‌లో మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేసింది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన నాటి నుంచి డీలర్లకు కమీషన్ చెల్లింపు నిలిచిపోయింది. కమీషన్ డబ్బులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన కమీషన్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఐదు నెలల కమీషన్ రూ.69,98,015.5లను డీలర్లలో అకౌంట్లో జమ చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం కమీషన్ చెల్లించకుండా జాప్యం చేస్తోంది. ఐదు నెలలకు సంబంధించి రూ. 3,49,90,077.5 కమీషన్ పెండింగ్‌లో ఉంది. దీంతో డీలర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. షాపు అద్దె, గుమస్తా జీతం అప్పులు చేసి చెల్లించాల్సివస్తోంది. దీనికితోడు బియ్యం దిగుమతి ఖర్చులు కూడా డీలర్లే భరిస్తున్నారు. ఐదు నెలలుగా కమీషన్ చెల్లింపు నిలిచిపోవడంతో రేషన్ డీలర్లకు దుకాణాల నిర్వహణ భారంగా మారింది.
అమలుకాని హామీలు
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్వింటాకు కమీషన్ రూ.300, గౌరవ వేతనం నెలకు రూ.5 వేలు చొప్పున చెల్లిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు హామీలు అమలు చేయడంలేదు. కమీషన్ సక్రమంగా చెల్లించాలని, హామీలు అమలు చేయాలని కోరుతూ రేషన్‌డీలర్లు జిల్లా వ్యాప్తంగా నిరసన బాట పట్టారు. తహసీల్దార్ కార్యాలయాల్లో డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. ఈ నెల 6న రేషన్ దుకాణాలను ఒక రోజు బంద్ చేసి నిరసన తెలిపారు.
జిల్లాకు వచ్చే బియ్యం : 59,982.99
కేంద్రం కోటా: 49,985.825
రాష్ట్ర ప్రభుత్వం కోటా : 9,997.165
మొత్తం కమీషన్ : రూ.83,97,618.6
కేంద్రం వాటా: రూ.69,98,015
ఐదు నెలల పెండింగ్ కమీషన్ : రూ. 3,49,90,077.5
రాష్ట్ర ప్రభుత్వ వాటా : రూ.13,99,603.1
ఇటీవల చెల్లించిన ఐదు నెలల కమీషన్ : రూ.69,98,015.5
ఐదు నెలలుగా కేంద్ర ప్రభుత్వం కమీషన్ చెల్లించకపోవడంతో రేషన్ షాపుల నిర్వహణ భారంగా మారింది. షాపు నిర్వహణ, కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. కేంద్రం పెండింగ్ కమీషన్ విడుదల చేయాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి. –ఊకే శేఖర్‌రావు,
రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

రేషన్ డీలర్ల ఎదురుచూపులు