
రెండు తాచుపాముల పట్టివేత
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామపంచా యతీకి చెందిన రజాక్ అనే వ్యక్తి ఇంట్లోకి సోమవా రం తాచుపాము వచ్చింది. ప్రాణధా ర ట్రస్ట్ అధ్యక్షుడు, కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. శ్రీనగర్ కాలనీ నాలుగో లైన్‌లో కూడా ఓ ఇంట్లోకి తాచుపాము రాగా సంతోష్ వెళ్లి పట్టుకున్నారు. అనంతరం రెండు పాములను అటవీప్రాంతలో వదిలిపెట్టినట్లు తెలిపారు.
నేడు సురవరం సంస్మరణ సభ
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ మంగళవారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఉదయం 10 గంటలకు నిర్వహించే సంస్మరణ సభకు హాజరుకావాలని కోరారు.