
ఆనకట్ట తెగినా.. పెరిగిన వరిసాగు
వానాకాలం పంటల సాగు విస్తీర్ణం(ఎకరాల్లో)
ఆయకట్టులో స్వల్పంగా మాత్రమే తగ్గిన పంటల సాగు వర్షాధారంగా సాగుకు మొగ్గు చూపిన రైతులు
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
గతేడాది పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు పడిన భారీ గండి (ఫైల్)
అశ్వారావుపేటరూరల్: పెదవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట తెగినా ఆయకట్టులో సాగు పెద్దగా తగ్గలేదు. గతంకంటే కేవలం 178 ఎకరాల్లోనే సాగు తగ్గింది. కానీ వరి సాగు మాత్రం గతం కంటే పెరిగింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలో 0.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1975లో ప్రాజెక్ట్ నిర్మించారు. అశ్వారావుపేట మండలంతోపాటు, ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 16 వేల ఎకరాలకు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగు నీరు అందించారు. తెలంగాణలో 3 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, మిగతాది ఆంధ్రాలో ఉంది. భారీ వర్షాలు, అధికారుల నిర్లక్ష్యంతో గతేడాది జూలై 18న ప్రధాన ఆనకట్టకు గండ్లు పడ్డాయి. దీంతో ఆయకట్టు సాగు భారీగా తగ్గిపోతుందనే ఆందోళన నెలకొంది. కానీ పంటల విస్తీర్ణం స్వల్పంగా మాత్రమే తగ్గింది. గతేడాది వానాకాలంలో 3,053 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయగా, ఈ ఏడాది 2,875 ఎకరాల్లో సాగు చేశారు. వరి పంట గతేడాది 1,194 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 1,420 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది కంటే 226 ఎకరాల్లో వరి సాగు పెరిగింది.
250 మీటర్ల మేర గండ్లు
పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు 250 మీటర్ల దాకా గండ్లు పడి కొట్టుపోగా, దాదాపు 20 చోట్ల ప్రధాన కట్ట దెబ్బతిన్నది. కుడి, ఎడమ కాలువ స్టచ్చర్లు దెబ్బతిన్నాయి. ఆయకట్టు కింద అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి, వడ్డర రంగాపురం, కోయ రంగాపురం, బచ్చువారిగూడెం, కొత్తూరు పరిధిలో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలను సాగు చేస్తుండగా, గతేడాది కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగింది. పత్తి పంట సాగు స్వల్పంగా తగ్గింది. ప్రాజెక్ట్ నుంచి సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో ఆయకట్టు రైతులంతా వర్షాధారంగా సాగు చేపట్టారు. ఈ క్రమంలో వరి సాగుకు మొగ్గుచూపారు. మొక్కజొన్న ఒక్క ఎకరాలో కూడా సాగు చేయలేదు. మిర్చి గతేడాది 250 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 50 ఎకరాలను
వర్షాధారంగా..
పెదవాగు ప్రాజెక్ట్ పునర్నిర్మాణం ఇప్పట్లో జరిగే అవకాశాలు లేకపోవడంతో అశ్వారావుపేట మండలంలోని రైతులు వర్షాధారంపైనే పంటలను సాగు చేస్తున్నారు. పెదవాగు ఆయకట్టు కింద వరిక్షేత్రాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోతే వరి పంట సాగు చేసే రైతులకు తీరని నష్టం వాటిల్లే అవకాశాలు ఉండగా, వాన దేవుడే దిక్కుగా పంటను సాగు చేస్తున్నారు.
పెదవాగు ప్రాజెక్టు కింద గత ఏడాది కంటే ప్రస్తుత ఖరీఫ్ సీజ్‌లో వరి పంట సాగు పెరిగింది. గతేడాది ఆనకట్టకు గండ్లు పడిన తర్వాత పంట నష్టం వాటిల్లింది. దీంతో క్రాప్ బుకింగ్‌లో వరి పంట సాగు కొంతమేర నమోదు తగ్గింది. తాజాగా ఆయకట్టు రైతులు వర్షాధారంగా వరి పంట సాగుకు అధికంగా మొగ్గు చూపారు. మొక్కజొన్న పంటలు సాగు చేసే రైతులు కుడా వరి పంట సాగు చేయడం వల్ల వరిసాగు పెరిగి ఉండొచ్చు.
– పి.శివరామ ప్రసాద్, ఏఓ, అశ్వారావుపేట
పంట పేరు గతేడాది ఈ ఏడాది
వరి 1,194 1,420
పత్తి 1,429 1,405
మొక్కజొన్న 180 00
మిర్చి 250 50
మొత్తం 3,053 2,875
గతేడాది కొట్టుకుపోయిన పెదవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట

ఆనకట్ట తెగినా.. పెరిగిన వరిసాగు

ఆనకట్ట తెగినా.. పెరిగిన వరిసాగు

ఆనకట్ట తెగినా.. పెరిగిన వరిసాగు