
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటలు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులను వీక్షించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 410 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.22,395 ఆదాయం లభించింది. 270 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.16,210 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ జెన్‌కో డైరెక్టర్(హైడల్) ఎం.సుజయ్‌కుమార్, ఏపీ ట్రాన్స్‌కో రిటైర్డ్ సీఈ ప్రతాప్‌రెడ్డి, సీలేరు జలవిద్యుత్ కేంద్రం రిటైర్డ్ సీఈ రాంబాబు, కేటీపీఎస్ 5,6 దశల చీఫ్ ఇంజనీర్(సీఈ) ప్రభాకర్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కిన్నెరసానిని సందర్శించారు. అనంతరం రిజర్వాయర్‌లో బోటు షికారు చేశారు.