
జేఎంఈటీలు మళ్లీ ఉద్యోగంలోకి..
మరో అవకాశం అదృష్టం
● టర్మినేట్ అయిన 43 మంది పునర్నియామకం ● సింగరేణి చరిత్రలో తొలిసారి అవకాశం
సింగరేణి(కొత్తగూడెం): అధికార హోదా (జేఎంఈటీ–జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రెయినీ)లో ఉండి టర్మినేట్ అయిన 43 మంది అధికారులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. వారు విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, నిర్ణీత గడువులోకి స్టడీ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతోపాటు పలు కారణాలతో టర్మినేట్ అయ్యారు. దీంతో యాజమాన్యం వారికి మరో అవకాశం కల్పించింది. 2023లో గుర్తింపు సంఘంగా ఎన్నికై న ఏఐటీయూసీ జేఎంఈటీల సమస్యను తెలుసుకుంది. అనంతరం యూనియన్ నాయకులు యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడంతో యాజమాన్యం ఈ నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరంతా సంస్థ ఏర్పాటు చేసిన హైకమిటీ ఎదుట తమ వివరాలు 45 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండి, (ఓవర్‌మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్, ఫస్డ్ ఎయిడ్ సర్టిపికెట్లు) సమర్పించుకోవాల్సి ఉంది. కమిటీ సూచన మేరకు ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది.
ప్రాథమిక అపాయింట్‌మెంట్ జారీ
అన్ని పరీక్షలు పూర్తి అయితేనే జేఎంఈటీలకు ప్రాథమిక అపాయింట్‌మెంట్‌ను సంస్థ జారీ చేస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరిన జేఎంఈటీలకు గ్రేడ్–సీ, ప్రాథమిక నియామకం అందిస్తారు. తొలి ఏడాదిలో 190 మస్టర్లు తగ్గకుండా చేస్తే పర్మనెంట్ ఉద్యోగం వచ్చినట్లవుతుంది. లదంలే తిరిగి టర్మినేట్ అవుతారు.
గతంలో బదిలీ వర్కర్లు, జనరల్ అసిస్టెంట్లు వివిధ కారణాలతో డిస్మిస్ అయితే సంస్థ వారికి ఉద్యోగ అవకాశం కల్పించేది. కానీ, సింగరేణిలో తొలిసారిగా టర్మినేట్ అయిన జేఏంఈటీలకు మరో అవకాశం కల్పించటం వారి అదృష్టం. ఇప్పటికై నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి పనిచేసి, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి. –ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి