వాగులో మునిగి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

వాగులో మునిగి వ్యక్తి మృతి

Sep 8 2025 5:50 AM | Updated on Sep 8 2025 5:50 AM

వాగుల

వాగులో మునిగి వ్యక్తి మృతి

దుమ్ముగూడెం: మండలంలోని పెద్దబండిరేవు సమీపంలోని గుబ్బలమంగి వాగులో ప్రమాదవుశాత్తు మునిగి చిన్నబండిరేవు గ్రామానికి చెందిన పశువుల కాపరి పెనుగొండ వెంకన్న (55) మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వెంకన్న పశువులను తీసుకుని గుబ్బలమంగి వాగు వైపు వెళ్లగా అక్కడ గేదె వాగులో దిగడంతో దానిని బయటకు తరలించేందుకు వెళ్లి ప్రమాదవుశాత్తు మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, సీఐ వెంకటప్పయ్య ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా వెంకన్న మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లోయలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

గుండాల: కిన్నెరసాని నుంచి ఇసుక తోలుతున్న ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలోకి దూసుకెళ్లింది. ఇసుకలో కూరుకుపోయిన డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎస్‌కే పాషా (65) ఇసుక తీసుకొచ్చేందుకు కిన్నెరసాని వాగుకు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా వెళ్లాడు. ఇసుక లోడు చేసుకుని వచ్చే క్రమంలో సాయనపల్లి – గుండాల మార్గంలో దేవరచింత వద్ద రోడ్డు పక్కన గుంతలోకి పోయి.. అటుపక్కన లోయలోకి దూసుకెళ్లింది. పాషాకు చెట్ల కొమ్మలు తగిలి ఇంజన్‌ టైరు పక్కన పడి ఇసుకలో కూరుకుపోయి, అక్కడికక్కడే మృతి చెందాడు. గుండాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. కిన్నెరసాని వాగు నుంచి ఇస్టానుసారంగా ఇసుక తరలిస్తుండడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మాజీ సర్పంచ్‌ ఇంటిపై దాడి

పాల్వంచరూరల్‌: మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ మాలోత్‌ హరి ఇంటిపై ఆదే గ్రామానికి చెందిన కొందరు యువకులు శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. వినాయకుని ఊరేగింపు సందర్భంగా దుస్తుల విషయంలో తలెత్తిన వివాదంతో మాజీ సర్పంచ్‌ ఇంటిపై దాడి చేశారు. దీంతో హరి, ఆయన భార్య అనూష, తల్లి హచ్చమ్మ గాయపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేశారని, విచారణ జరుపుతున్నామని, కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

డ్రైవర్‌ మృతి

వాగులో మునిగి వ్యక్తి మృతి1
1/1

వాగులో మునిగి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement