
జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మృతి
తిరుమలాయపాలెం: జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు, యూటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, సీపీఎం మండల మాజీ కార్యదర్శి సుబ్లేడు గ్రామానికి చెందిన ఎస్డీ జియాఉద్దీన్ (76) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో పలు పార్టీల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, బోడ మంచానాయక్, ఆర్మి రవి, తుళ్లూరు నాగేశ్వరరావు, నర్సయ్య, రమేశ్, స్వామి, బాబూరావు, నిర్మల్‌రావు, ఉపేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీయాఉద్దీన్ మృతి తీరని లోటు
ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయ, ప్రజా ఉద్యమ నేత జియాఉద్దీన్ ఆకస్మిక మృతి తీరని లోటనీ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావా రవి, ఎ.వెంకట్ అన్నారు. నగరంలో ఆదివా రం జరిగిన సంస్మరణ సభలో వారు మాట్లాడారు. జియాఉద్దీన్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా సేవలందించారని తెలిపారు. కార్యక్రమంలో దుర్గాభవాని, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నున్నా నాగేశ్వరరావు, మచ్చ వెంకటేశ్వర్లు, పొన్నం వెంకటేశ్వరరావు, సోమయ్య విక్రమ్, సాయిబాబు, సరళ, హైమావతి పాల్గొన్నారు. కాగా, జియాఉద్దీన్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
పలు పార్టీల నాయకుల సంతాపం

జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మృతి