
హోరాహోరీగా ప్రచారం
కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
కొత్త మాస్టర్ ప్లాన్‌పై ఆలయ వైదిక కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి తమను సంప్రదించకుండానే ప్లాన్ రూపొందించటంపై కినుక వహించినట్లు తెలుస్తోంది. గతంలో చినజీయర్ స్వామి సూచనతో ఆనంద సాయి రూపొందించిన ప్లాన్‌ను వీరు ఆమోదించారు. అయితే ప్రస్తుత ప్లాన్‌పై వీరు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం పర్యటన సమయంలో వైదిక కమిటీ సలహాలను తప్పకుండా తీసుకోవాలని, వారి ఆమోదం తర్వాతే ప్లాన్‌ను ఫైనల్ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే వైదిక కమిటీ, పండితులు, దేవాదాయ శాఖ అధికారులు సమష్టిగా ఈ ప్రణాళికను ఆమోదిస్తేనే ఆలయాభివృద్ధి కల సాకారం కానుంది. లేదంటే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశమే ఉండదు.