
ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నిక
అధ్యక్ష,కార్యదర్శులుగా
పవన్ కుమార్, మహేష్
పాల్వంచ: టీజీ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ సంస్థల పరిధిలోని అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఫలితాలు శుక్రవారం వెల్లడించారు. కేటీపీఎస్ కాలనీలోని ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్‌లో ఎలక్షన్ ఆఫీసర్ బి.రవికుమార్ ఆధ్వర్యంలో కౌంటింగ్ నిర్వహించారు. అసోసియేషన్‌లో సుమారు 2,500 మంది సభ్యులు ఉండగా, ఈ నెల 2న రాష్ట్రంలో సుమారు 25 చోట్ల పోలింగ్ నిర్వహించారు. మొత్తం 1,814 ఓట్లు పోలయ్యాయి. 14 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగడం విశేషం. అధ్యక్షుడిగా గువ్వల పవన్‌కుమార్ (ట్రాన్స్‌కో), జనరల్ సెక్రటరీగా తాళ్లపల్లి మహేష్(జెన్‌కో–కేటీపీఎస్), అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కె.కుమారస్వామి, అడిషనల్ జనరల్ సెక్రటరీగా కె.రామకృష్ణ ఎన్నికయ్యారు. వీరితోపాటు ఎం.చందు, జి.శ్రీపాల్ రెడ్డి, కె.వెంకటేష్, ఆర్‌సీ, భరత్‌కుమార్, వి.మహిపాల్, డి.వంశీ, హెచ్.రంజిత్ రెడ్డి, ఆర్.కిరణ్, డి.మహేష్, జి.శ్రీకాంత్, కె.చంద్రశేఖర్ రెడ్డి, ఎం.నాగేంద్ర, దయానంద్, టి.సందీప్ రెడ్డి, ఎ.శ్రీకాంత్, ఎ.శ్రీనివాస్, పి.రజినికాంత్, బి.నరేష్, శ్రీకాంత్, వై.శ్రావణ్‌కుమార్, తుమ్మల నవీన్, ఎం.దిలీప్ కుమార్, సీహెచ్.నవీన్ కుమార్‌లు వివిధ పోస్టులకు పోటీ చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఏఈల సమస్యల పరిష్కారానికి కోసం కృషి చేస్తామని తెలిపారు. అనంతరం స్వీట్లు పంచుకుని సంబురాలు నిర్వహించారు.