
● మణుగూరు కళాశాల ప్రిన్సిపాల్‌కు..
మణుగూరు టౌన్: అశ్వాపురానికి చెందిన నల్లగడ్డ సత్యప్రకాశ్ 2002లో గుంటూరులో అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి 2021 మార్చిలో అశ్వాపురం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ప్రతి ఏటా గౌతమీ ఫౌండేషన్ సహాయంతో 30 మంది పేద విద్యార్థులకు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున, మరికొందరు పేద విద్యార్థులకు ఐటీసీ ద్వారా ఏడాదికి రూ.లక్ష విలువ చేసే నోట్‌బుక్స్ అందించేలా కృషి చేశారు. అనంతరం మణుగూరు జూనియర్ కళాశాల ప్రిన్సి పాల్‌గా బదిలీ అయి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కళాశాల రూపురేఖలు మార్చడంతో పాటు అదనపు తరగతులు, సీసీ రోడ్ల నిర్మాణానికి విశేష కృషి చేశారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేశారు. ఎఫ్‌సెట్, నీట్‌లో విద్యార్థులకు శిక్షణనిస్తూ పరీక్షలకు సన్నద్ధం చేశారు. గతేడాది స్వచ్ఛంద సంస్థ సహకారంతో 100 రోజులు విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 163 మంది పిల్లలు ఉండగా ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య 240కి పెంచి ప్రభుత్వ కళాశాల బలోపేతానికి విశేష కృషి చేశారు. గత ఆగస్టు 15న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ జితేష్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు అందుకున్నారు. సత్యప్రకాశ్‌ను ప్రస్తుతం రాష్ట్ర స్థాయి అవార్డు వరించడం పట్లఅధ్యాపకులు, విద్యార్థులు చేస్తున్నారు.