
భూ సేకరణపై కలెక్టర్ సమీక్ష
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో నూతన బొగ్గు ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ కోసం సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులతో గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో ప్రతిపాదిత బొగ్గు గనులను త్వరగా ప్రారంభించేలా భూ సేకరణతో పాటు అటవీ శాఖ అనుమతులపై చర్చించారు. సమావేశంలో డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్, ఆర్‌డీఓ మధు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల జీఎంలు శాలేంరాజు, దుర్గం రాంచందర్, వీసం కృష్ణయ్య, డీజీఎం(ఎస్టేట్స్) టి.హీర్యా తదితరులు పాల్గొన్నారు.