
● అవార్డుల అధ్యాపకురాలు..
సూపర్‌బజార్(కొత్తగూడెం): సింగరేణి డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు డాక్టర్ కె.సావిత్రి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభ చాటుతున్నారు. అంతర్జాతీయస్థాయిలో నాలుగుసార్లు, జాతీయస్థాయిలో అనేకసార్లు పతకాలను సాధించారు. ఆమె వద్ద శిక్షణ పొందిన నలుగురు విద్యార్థినులు అంతర్జాతీయస్థాయిలో రాణించారు. 300 మంది జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచారు. విద్యార్థినులకు క్రీడలో శిక్షణనిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పలు అవార్డులు అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ ఎడ్యుకేషన్ నుంచి ఎమినెన్స్ అవార్డు ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్–2025 అవార్డును రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, టూరిజం, కల్చర్ అండ్ అర్కియాలజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా అందుకున్నారు. రోటరీక్లబ్ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు ఇచ్చి సత్కరించారు. సొంత ఖర్చులతో బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.